"సంక్రాంతికి వస్తున్నాం"నుండి 1st సింగల్ వచ్చేసింది..! 19 d ago
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుండి 1st సింగల్ "గోదారి గట్టు" విడుదలయ్యింది. భాస్కర భట్ల రచించిన ఈ పాటకి రమణ గోగుల సంగీతం అందించారు. ఈ మూవీ కి బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ కు జంటగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించనున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న థియేటర్ లోకి రానుంది.